ఆగస్టు 01 నుండి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో ప‌దవ త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు.

ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

◆ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్ ::

ఆగ‌స్టు 1 – ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 3 – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు 4 – మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు 5 – జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు 6 – సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

Follow Us @