కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్మేటివ్ అసెస్మెంట్ (FA) మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది.
కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పదవ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది.
