SSC GD CONSTABLE : 50,187 ఉద్యోగాల ఫిజికల్ టెస్టులు వాయిదా

న్యూడిల్లీ (ఎప్రిల్‌ – 21) : సాయుధ బలగాలలో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్ మాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు జరగాల్సిన ఫిజికల్ ఎపిసియన్సీ టెస్టు లు వాయిదా పడ్డాయి.

రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్టీ, పీఈటీలను ఎప్రిల్‌ 24 నుండి నిర్వహించనున్నట్లు CRPF గతంలోనే ప్రకటించింది. అయితే పాలనాపరమైన కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా పేర్కొంది.

శారీరక సామర్థ్య పరీక్షలను మే 1 తర్వాత ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. వాయిదా పడిన సమాచారాన్ని ఫిజికల్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా పంపుతోంది. త్వరలోనే ఇ-అడ్మిట్ కార్డు డౌన్లోడ్ సదుపాయం పునరుద్ధరించి అందుబాటులో తీసుకొస్తామని సీఆర్పీఎఫ్ తెలిపింది.