SSC GD CONSTABLE – పదో తరగతితో 50 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 23) : SSC GD CONSTABLE JOB NOTIFICATION 2024. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ విభాగాల్లో దాదాపు 50 వేల వరకు కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం (2024-25) ఆగస్టు 27న నోటిఫికేషన్ వెలువడనుంది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

SSC GD CONSTABLE JOB NOTIFICATION 2024

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీన పూర్తి కానుంది.

2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి.

2023 లో 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపుగా 50 వేల పోస్టులు భర్తీ కానున్నట్లు సమాచారం

వివిధ దశల్లో నియామక ప్రక్రియ

బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎత్తు : పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయోపరిమితి : అభ్యర్థులు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.

వెబ్సైట్ : https://ssc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు