SSC పరీక్షలో 6 పేపర్లే – పాఠశాల విద్యాశాఖ

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఎక్కువ శాతం ఆన్లైన్ తరగతులు జరగడం వలన 2020 – 21 విద్యా సంవత్సరానికి SSC బోర్డు పరీక్షలను 11 పేపర్ లకు బదులు ఆరు పేపర్లకు కుదిస్తూ పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

ఇంతకు ముందు ఉన్న 11వ స్థానంలో ఆరు పేపర్లే ఉంటాయని మార్కులు మాత్రం యధావిధిగా 80 మార్కులకు ఉంటాయని పేర్కొన్నారు.

అలాగే ఈ ఆరు పేపర్ల పరీక్ష విధానం కేవలం ఈ విద్యా సంవత్సరానికే పరిమితమని పేర్కొన్నారు.

సెకండ్ లాంగ్వేజ్ కు ఎప్పటిలాగా ఒకటే పేపరు ఉంటుందని మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు పేపర్లకు బదులు ఒకే పేపరు ఉంటుందని పేర్కొన్నారు.

మూల్యాంకనం సులభంగా చేయడానికి బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలలో మాత్రం ఆన్సర్ బుక్ లెట్ లను వేరువేరుగా ఇస్తారని తెలియజేశారు.

విద్యార్థుల సౌకర్యార్థం ఈ పరీక్షలలో ప్రశ్నాపత్రాలలో ఎక్కువ ఛాయిస్ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేశారు.

పరీక్ష సమయం కూడా 30 నిమిషాలు పెంచుతూ గతంలో ఉన్న రెండు గంటల 45 నిమిషాల నుండి మూడు గంటల 15 నిమిషాలకు పెంచడం జరుగుతుంది.

మార్కుల వెయిటేజీ కూడా గతంలో ఉన్నట్లుగానే బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ అసెస్మెంట్ కు 20 మార్కులు చొప్పున ఇవ్వబడును.

Follow Us@