న్యూడిల్లీ (డిసెంబర్ – 08) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 2022-23 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(CHSL) ప్రకటనను విడుదల చేసింది.
◆ మొత్తం పోస్టుల సంఖ్య : 4,500
◆ పోస్టుల వివరాలు : లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), యర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్(డీఈ వో), డేటాఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ).
◆ అర్హతలు : ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో.. డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్ తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
◆ వయోపరిమితి : 01.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్లు మధ్య ఉం డాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగు లకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.
◆ వేతనం :
ఎల్డీసీ, జేఎస్ఏ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు,
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు,
డేటా ఎంట్రీ ఆప రేటర్ గ్రేడ్-ఎకు రూ.29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.
◆ ఎంపిక విధానం : టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూ టర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష.
◆ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.
◆ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం : 06.12.2022
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది :04.01.2023
◆ టైర్-1 పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) తేదీ : ఫిబ్రవరి/ మార్చి 2023
◆ వెబ్సైట్ : ssc.nic.in
Follow Us @