న్యూడిల్లీ (డిసెంబర్ – 18) : వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 20 వేలకు పైగా ఉన్న ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ – (CGLE-2022) (టైర్-1) ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC) డిసెంబర్ 17న విడుదల చేసింది.
SSC డిసెంబర్ 1 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి సమాధానాల కీతో పాటు రెస్పాన్స్ షీట్ ను చూసుకోవచ్చు.
కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 17 నుంచి 20వ తేదీలోగా రూ.100 రుసుం చెల్లించి తెలియజేయవచ్చు.
★ వెబ్సైట్ : https://ssc.nic.in/#