SSC CGL : టైర్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (ఫిబ్రవరి – 25) :కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- (CGL – 2022) టైర్-2 పరీక్షల నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.

మార్చి 2 నుంచి 7 వరకు జరుగనున్నాయి. మార్చి 2, 3, 6, 7 తేదీల్లో పేపర్-1 పరీక్ష.. అలాగే మార్చి 4న పేపర్-2, 3 పరీక్షలు జరపనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.