SSC : కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ 2021 ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీకై కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది.

● పోస్టుల వివరాలు :: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్ స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్ స్పెక్టర్, . జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితరాలు.

అర్హతలు :: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్) / మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి :: పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1, టైర్ 2), డిస్క్రిప్టివ్ పేపర్ (టైర్ 3), స్కిల్ టెస్టు (టైర్-4) ఆధారంగా.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

● దరఖాస్తులకు చివరి తేదీ :: జనవరి 25 – 2022

టైర్-1 కంప్యూటర్ రాతపరీక్ష :: ఏప్రిల్ – 2022.

టైర్-2 అండ్ టైర్ 3 పరీక్ష తేదీలు :: వెల్లడించాల్సి ఉంది.

వెబ్సైట్: https://ssc.nic.in/