కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న LDC, PA, DEO పోస్టుల భర్తీకి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,726 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
● పోస్టుల సంఖ్య :: 4726
- లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC) లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) 1538 పోస్టులు
- పోస్టల్ అసిస్టెంట్ (PA) లేదా సార్టింగ్ అసిస్టెంట్ (SA) 3181
- డాటా ఎంట్రీ ఆపరేటర్లు (DEO) 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
● అర్హతలు : LDC లేదా JSA, PA లేదా SA, DEO లకు ఇంటర్ పాసై ఉండాలి,
కాగ్‌లో DEO పోస్టుకు ఇంటర్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
అదేవిధంగా 18 నుంచి 27 ఏండ్ల లోపువారై ఉండాలి.
రిజర్వేషన్ల అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్లో
● ఎంపిక పద్దతి :: రాతపరీక్ష
ఇది మొత్తం మూడు విభాగాలుగా ఉంటుంది.
టైర్-1లో 100 ఆబ్జెక్టివ్ బిట్లు ఉంటాయి. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ( ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్) ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఇందులో అర్హత సాధించినవారిని టైర్-2కు, అందులో క్వాలిఫై అయినవారిని టైర్-3కి ఎంపికచేస్తారు.
● అప్లికేషన్ ఫీజు :: రూ.100
● చివరి తేది :: డిసెంబర్ 15
● టైర్-1 పరీక్ష :: 2021 ఏప్రిల్ 12 నుంచి 27 వరకు
● వెబ్సైట్: : https://ssc.nic.in
Follow Us@