యుద్ధం అనేది అభివృద్ధికి దారితీసే ప్రక్రియ – టీజీవో సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • టీజీవో ఉమ్మడి వరంగల్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి

హైదరాబాద్ (నవంబర్ – 20) : ప్రజా సమస్యలు ప్రజా ఉద్యమాల పట్ల అధికార వర్గాలు స్పందించడం నేరం, పాపం అనే ధోరణిని తుత్తునియలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఉద్భవించిన కొట్లాడిన సంఘం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అని టీజీవో చైర్మన్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని అన్నారు. టీజీవో ఆవిర్భావ కార్యాచరణ కొరకు వరంగల్ చోదక శక్తిగా పని చేసింది. అసెంబ్లీలో హన్మకొండ బిడ్డ అమరుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ తెలంగాణ పదం ప్రస్తావించినప్పుడు వలస పాలకులు ఎంతటి కక్ష్య అణచివేతను చేసిందో చరిత్రలో నమోదైంది. టీజీవో పుట్టుక నాటి నుండి ఆంధ్ర పాలకులు అనేక ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి కుట్ర కేసులతో అణచివేతకు పాల్పడే ప్రయత్నాలు అనేకం చేసింది. జెంకక మరింత ధిక్కారంతో, రాజ్యాంగ చట్రంలో పోరాటాలతో ముందుకు వెళ్ళాము. ఉద్యమంలో షాద్ నగర్ మహిళా అధికారి అరెస్ట్ చేసినప్పుడు ఆమె చూపించిన తెగువ చిరస్మరణీయ ఘట్టం.

భారత చరిత్రలో ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యోగ ఉద్యమాల ద్వారా ఎదిగి ప్రభుత్వ పాలనలో కేబినెట్ మంత్రిగా చేరడం టీజీవోకు మాత్రమే సాధ్యమయ్యింది. ఉద్యమ స్పూర్తితో కేసీఆర్ దార్శనికతను స్వరాష్ట్రంలో పని చేయడం వలెనే రాష్ట్రం అనేక ప్రగతి సూచికలలో దేశంలో అగ్గస్థానంలో చేరుకుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాలు సాకారం అయ్యాయి. ఈ అంశం ప్రభుత్వం గుర్తించడం వలన రెండు సార్లు ఉత్తమ పి ఆర్ సి ని ఇవ్వడం జరిగింది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు అత్యంత వేగంగా జరిగాయి. ఉద్యోగులతో ఉద్యమ బంధం ఉన్న కేసీఆర్ మన ఆకాంక్షలకు పట్టం కడతాడు. ప్రజా సంక్షేమం మౌలిక సౌకర్యాల కల్పన వలన తెలంగాణ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతున్నాయి. సంపద పెంపు విలువ పెరగడం సామాన్య ప్రజలకు ఉద్యోగ వర్గాలకి ఆనందాన్ని ఇచ్చే అంశం..ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు వంటి సహాకార స్ఫూర్తిని ఐకమత్యమే మహా బలం అనేదే టీజీవో హృదయం. సభ్యులకి అన్ని రకాలుగా భరోసాను ఇచ్చే సంఘం టీజీవో. ఇటీవల టీజీవో సభ్యుడు రచయిత అస్నాల శ్రీనివాస్ అంశంలో సంఘం పూర్తి స్థాయిలో అతనికి అండగా నిలిచింది.

వరంగల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ జగన్ మోహన్ రావు సంఘ కృషిలో అగ్రగామిగా ఉన్నారు. టీజీవో తోలి భవనం సాధించిన ఘనత జగన్ గారిదే. ఉమ్మడి అన్ని జిల్లా కేంద్రాలలో టీజీవో భవన స్థలాల కేటాయింపులో ముఖ్య పాత్ర పోషించాడు. సంఘ పటిష్టతలో కేడర్ సేవలో ఇదే స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవాలి. టీజీవో కేంద్ర సంఘ కార్యదర్శి సత్యనారాయణ. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, నగర అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

హన్మకొండ హరిత హోటల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. డా .ప్రవీణ్ స్వాగత వచనాలతో ప్రారంభమైన ఈ ఆత్మీయ సమావేశానికి జగన్మోహన్ రావు అధ్యక్షత వహించారు. టీజీవో వరంగల్ ప్రస్థానాన్ని సాధించిన విజయాలను ఉత్తేజకర రీతిలో సభ్యులకు తెలియచేసారు. వరంగల్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, భూపాలపల్లి అధ్యక్షులు సామ్యేల్, ములుగు అధ్యక్షులు వెంకయ్యలు ప్రసంగించారు. టీజీవో మరియు అనుబంధ సంఘాల నాయకులు ఫణి కుమార్, రాజ్ కుమార్, అన్వర్ హుసేన్, అంజాద్, అలీ, వెంకటేశ్వర్ రావు, అస్నాల శ్రీనివాస్, నారాయణ, రఫీ, రాజేష్, సుధీర్, అశోక్, మల్లీశ్వరి, భాగ్యలక్ష్మి, కవిత, గీత, వాసవి విజయ నిర్మలతో పాటు అనేక శాఖల అధికార్లు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి హాజరైన టీజీవో లకు శ్రీనివాస్ గౌడ్ ఆకట్టుకునే ఆలోచనాత్మక ఆత్మీయ సంభాషణ గొప్ప అనుభూతిని భరోసా ను ఇచ్చింది.జగన్మోహన్ రావు సంఘం సభ్యుల పట్ల చూపించే సహానుభూతి నిర్వహణ ఆతిధ్యం అందరి మనస్సులో ప్రవహించింది.

అస్నాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @