పూణే (నవంబర్ – 09) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు బెంగళూరు వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాదించి, సెమీస అవకాశాలు కూడా సజీవంగా ఉంచుకుంది.
పాకిస్థాన్ & ఆప్ఘనిస్థాన్ జట్ల ఆడే తదుపరి మ్యాచ్ ఫలితాలు న్యూజిలాండ్ సెమీఫైనల్ అవకాశాలను ప్రభావం చేయనున్నాయి.
172 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన కివీస్ 5 వికెట్లు కోల్పోయి విజయం సాదించింది. కాన్వే – 45, మిచెల్ – 43, రవీంద్ర – 42 పరుగులతో రాణించారు. మాథ్యూస్ – 2, చమీరా, తీక్షణ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని శ్రీలంక ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసింది. శ్రీలంక బ్యాట్స్మన్ లలో పెరీరా – 51, తీక్షణ – 38* పరుగులతో పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ – 3, శాంట్నర్ – 2, ఫెర్గ్యూసన్ – 2, రచిన్ – 2, సౌథీ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ కివీస్ కు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో మంచి రన్ రేట్ తో గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి.. అలాంటి అవకాశం కివీస్ జట్టు కు వచ్చింది. శ్రీలంక ఇప్పటికే సిరీస్ నుంచి ఔట్ అయినా విషయం తెలిసిందే.
కివీస్ జట్టు 8 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉండగా, శ్రీలంక జట్టు 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.