హైదరాబాద్ (అక్టోబర్ – 05) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) పరిధిలోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లలో 2022 – 23 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లకు అక్టోబర్ 11 న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తెలిపారు.
◆ డిప్లొమా కోర్సులు : డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
◆ అర్హత : పదవ తరగతి పాసై, టీఎస్ పాలిసెట్ – 2022 లో అర్హత సాదించి ఉండాలి.
◆ ఎంపిక విధానం : టీఎస్ పాలిసెట్ – 2022 లో సాదించిన ర్యాంక్ ఆధారంగా
◆ దరఖాస్తు ఫీజు : 1100/- (SC,ST,PH లకు 600/-)
◆ స్పాట్ కౌన్సెలింగ్ తేదీ : అక్టోబర్ – 11 – 2022 ఉదయం 9.30 నుంచి
◆ వేదిక : వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్
◆ వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/index.html
Follow Us @