రామకృష్ణ మఠం ఆద్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు.

కరోనా కారణంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మూతపడ్డ నేపథ్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కోర్సులకు కోసం విద్యార్థులకు సరైన మార్గం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ మఠం హైదరాబాద్ వారు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ఆన్ లైన్ ద్వారా అందించనున్నారు.

స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ తరగతులు జనవరి – 9 – 2021 నుండి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ తరగతుల అడ్మిషన్ల కోసం రామకృష్ణ మఠం అధికారిక వెబ్ సైట్ నందు డిసెంబర్ 28 2020లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు అభ్యర్థి కనీస వయస్సు 17 సంవత్సరాలు లేదా పదవ తరగతి పాసై ఉండాలి.

ఈ ఆన్లైన్ తరగతులకు ఫీజుగా రూ. 1,300/- గా నిర్ణయించారు.

ఆన్లైన్ తరగతులకు సంబంధించిన మెటీరియల్ ను పోస్టు ద్వారా అభ్యర్థి అడ్రస్ కి పంపనున్నారు.

★ వెబ్సైట్ ::
http://rkmathadmissions.winnou.net/

★ సందేహాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :: 040- 27635545

Follow Us@