SBI లో 714 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచిలలో 714 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టులను రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీకి చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ పోస్టుల వివరాలు : మేనేజర్, రిలేషన్ మేనేజర్. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్,రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూ టీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.

◆ విభాగాలు: డాట్నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్ ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్మెంట్ తదితరాలు.

◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత స్పెష లైజేషన్లో డిగ్రీ / బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ /ఎంసీఏ ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఇంజనీ రింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్వేర్ ఇంజనీ రింగ్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరిం గ్)/ఎంబీఏ/పీజీ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి.

◆ వయోపరిమితి : పోస్టును అనుసరించి ఎప్రిల్ – 01 – 2022
నాటికి 20 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

◆ అనుభవం : సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం రెండేళ్లు నుంచి 12ఏళ్లు పని అనుభవం ఉండాలి.

◆ ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ పరీక్ష. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మేనేజర్, ఇంజనీర్ ఉద్యోగాలకు మాత్రం దరఖాస్తులను షార్టిస్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు.

◆ పరీక్ష విధానం : ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, ఐటీ నాలెడ్జ్, రోల్ బేస్డ్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు గాను 70 మార్కులు ఆన్లైన్ పరీక్ష నుంచి మరో 30 మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

◆ దరఖాస్తులకు చివరితేది : 20.09.2022

◆ వెబ్సైట్ : sbi.co.in/careers

Follow Us @