BIKKI NEWS (OCT. 22) : special programme on mental health on gjc girls husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో ఫస్ట్ టర్మ్ హాలిడేస్ దసరా సెలవుల తర్వాత కళాశాల ప్రారంభమైనప్పటి నుండి కళాశాలలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థినీలకు ఉదయం 9.00 నుండి 9.45 గంటల వరకు మరియు మధ్యాహ్నము 4.00 – 5.00 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కందుల శోభా దేవి గారు తెలిపారు.
special programme on mental health on gjc girls husnabad
అదేవిధంగా కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క ఆదేశాల మేరకు EAPCET/IIT/NEET కోచింగ్ ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈరోజు కళాశాలలో జాతీయ సేవా పథకం N.S.S. ఆధ్వర్యంలో విద్యార్థినిలకు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభాదేవి అధ్యక్షత వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి కందుల శోభా దేవి మాట్లాడుతూ… విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించి పట్టుదలతో ముందుకెళ్లి IPE MARCH – 2025 లో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించడంతోపాటు EAPCET/IIT/NEET మెరుగైన ర్యాంకులను సాధించాలని ఆకాంక్షించారు
విద్యార్థినిలు మానసిక ఒత్తిడికిలోను కాకుండా ఉండాలంటే ధ్యానం (Meditation) చేయాలని ఏకాగ్రతని కలిగి ఉండాలన్నారు. అనంతరం కళాశాల సివిక్స్ అధ్యాపకురాలు మరియు స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీమతి టి. నిర్మలాదేవి మాట్లాడుతూ… విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మానసిక ఒత్తిళ్లకు గురికావద్దని తెలుపుతూ పాజిటివ్ థింకింగ్ ని అలవర్చుకోవాలనే సూచిస్తూ, ప్రేరణతో ముందుకెళ్తే లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి. కరుణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి. రవీందర్, ఎస్. సదానందం, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్, ఎస్. కవిత, జి. కవిత, జి. కవిత, పి. రాజేంద్రప్రసాద్ మరియు అధ్యాపకేతర బృందం జూనియర్ అసిస్టెంట్ రాములు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.