ముఖ్య ప్రశ్నలు, ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేక డిజిటల్ తరగతుల షెడ్యూల్ – ఇంటర్ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులు సౌకర్యార్థం సెకండ్ ఇయర్ లో అతి ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలతో కూడిన వీడియో తరగతులు మరియు ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన వీడియో తరగతులను టీ శాట్ ద్వారా ప్రసారం చేసి విద్యార్థులలో పరీక్షలకు మానసిక స్థైర్యం నింపడానికి ఇంటర్మీడియట్ బోర్డు తో టీ శాట్ తో కలిసి షెడ్యూల్ విడుదల చేసింది.

ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 26 వరకు ద్వితీయ సంవత్సరం అతిముఖ్యమైన ప్రశ్నలతో కూడిన వీడియోలను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు టీ శాట్ ద్వారా ప్రసారం చేయనున్నారు. అలాగే ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలను ఫిబ్రవరి 20, 27, మార్చి 6, 12, 13, 19, 20
తేదీలలో ప్రసారం చేయనున్నారు.

కావున జిల్లా ఇంటర్ విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు పై టైం టేబుల్ ప్రకారం టీ శాట్ చానల్ ద్వారా వీడియో తరగతులను చూసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటన జారీ చేసింది.

అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ అయిన “DEPARTMENT OF INTERMEDIATE E – LERANING TELANGANA” ద్వారా కూడా డిజిటల్ తరగతులు విద్యార్థులు వీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Follow Us @