RBI : సావరీన్ గోల్డ్ బాండ్లు విడుదల

  • బాండ్ ఇష్యూ ధర 5,409/-
  • డిసెంబర్ 19 నుండి 23 వరకు దరఖాస్తుకు అవకాశం

ముంబయి (డిసెంబర్ – 17) : సావరీన్ గోల్డ్ బాండ్ పథకం (SGBS) 2022-23 మూడో ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,409గా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది.

డిసెంబర్ 19నుంచి 23 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని.. కనీసం 1 గ్రాము.. గరిష్టంగా 4 కిలోల వరకు వ్యక్తులు కొనుగోలు చేయొచ్చని… ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు డిజిటల్ చెల్లింపులు చేసుకునే మదుపర్లకు గ్రాముకు రూ.50/- చొప్పున రాయితీ ఇస్తారు. దీంతో వీరికి పసిడి బాండ్ ఇష్యూ రూ.5,359 అవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వడ్డీ రేటు 2.5%, కాలపరిమితి 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత విరమించుకోవచ్చు. ఈ స్కీమ్ కింద వచ్చే వడ్డీ ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది.

కేంద్రం తరపున ఆర్బీఐ బాండ్లను జారీ చేస్తుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SHCIL), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈ బాండ్లను అమ్ముతారు.