అహ్మదాబాద్ (నవంబర్ – 10) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా, ఆప్ఘనిస్థాన్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో సౌతాప్రికా విజయం సాదించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాప్రికా 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
సౌతాప్రికా బ్యాట్స్మన్ లలో వాండర్వ్ డుసెన్ (86*) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. డికాక్ 41 పరుగులతో రాణించారు. రషీద్ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 244 పరుగులు చేసింది.. ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్మన్ లలో ఒమర్జాయ్ – 97*, రహమత్ షా – 26, నూర్ అహ్మద్ – 26 పరుగులతో రాణించారు. ఒక దశలో 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆప్ఘనిస్థాన్ జట్టు ను ఒమర్జాయ్ కీలక ఇన్నింగ్స్ ఆడి గౌరవప్రదమైన స్కోర్ సాదించాడు. సౌతాప్రికా బౌలర్లలో కోయిట్జీ – 4, ఎంగిడి, మహరాజ్ చరో రెండు వికెట్లు తీసుకున్నారు.
భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్ లో అంత తేడాతో గెలిచే పరుగులు చేయకపోవడంతో అఫ్ఘనిస్తాన్ జట్టు ఫలితంతో సంబంధం లేకుండా సెమీఫైనల్ రేస్ నుంచి ఔట్ అయింది.