ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్, డాక్టర్, సీఏ, ఆర్డీఓ, ఎమ్మార్వో, బ్యాంక్ మేనేజర్ ఇలా ఏ ఉద్యోగాన్నైనా సరే సాధించాలనే తపన ఉండి చదివేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారా.? ఇకపై మీరు ఆ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విద్యార్థి చదువు నా బాధ్యత అంటున్నాడు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్… తన తల్లి సరోజ్ సూద్ జ్ఞాపకార్థంతో స్కాలర్షిప్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు.
అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనే ఆకాంక్షతో స్కాలర్షిప్ అనే కొత్త కాన్సెప్ట్‌కి శ్రీకారం చుట్టారు సోన్ సూద్. అక్టోబర్ 13వ తేదీ అమ్మ వర్ధంతి సందర్భంగా ”సరోజ్‌సూద్ స్కాలర్షిప్స్’’ పేరుతో “IAS ASPIRANTS REACH THEIR GOAL” అంటూ స్కాలర్షిప్ను ప్రవేశపెట్టాను.
● అర్హతలు ::
60శాతం మార్కులు సాధించి, ఏడాది ఆదాయం రూ.2.5లక్షల కంటే తక్కువ ఉన్నవారు అర్హులు. హాస్టల్ లాంటివి ఉంటే ఆ హాస్టల్ మెస్ ఛార్జీలు సైతం అదే స్కాలర్షిప్ ద్వారా చెల్లిస్తారు.
● వెబ్సైట్ :: https://scholifyme.com/
Follow Us@