హైదరాబాద్ (ఆగస్టు – 25) : తెలంగాణ రాష్ట్రంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రభుత్వ జూనియర్ & డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరోజు ఆర్థిక వైద్య &ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుకి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష & ప్రధాన కార్యదర్శులు జి. రమణ రెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
ఆగస్టు 26న ఉన్నత విద్యా శాఖలో మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోని పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ఆర్థిక శాఖ మాత్యులు ఆధ్వర్యంలోసంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చర్స్ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చర్స్ క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే త్వరగా పూర్తి చేయాలని, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో 2022 – 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యువల్ జీవో జారీ చేయాలని, నిధులు లేక ఏప్రిల్ & మే నెల కాంట్రాక్ట్ లెక్చర్స్ వేతనాలు చెల్లించని జిల్లాలకు వెంటనే పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని.. నెల నెల వేతనాలు సక్రమంగా అందేటట్లు చూడాలని కోరారు.
కాంట్రాక్ట్ లెక్చరర్స్ పదవి విరమణ వయసు పెంపుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న పెండింగ్ ఫైల్ ను త్వరగా పరిష్కారం అయ్యేటట్టు చూడాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జెఎల్ టు డిఎల్ ప్రమోషన్ వల్ల డిస్టర్బ్ కాంట్రాక్ట్ లెక్చరర్లను తిరిగి పునర్ నియామకం చేయాలని కోరారు. వివిధ కారణాలతో చనిపోయిన కాంట్రాక్ట్ లెక్చర్స్ కుటుంబాలను ఆర్థికంగా మరియు ఉపాధిపరంగా ఆదుకొని వారి కుటుంబాలని రక్షించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలియజేశారు.
Follow Us @