TOMCOM JOBS : జర్మనీలో ఐటీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (మే – 21) : జర్మనీ దేశంలో ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని TOMCOM (తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ) సంస్థ జనరల్ మేనేజర్ నాగభారతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అక్కడి కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, సాఫ్ట్ వేర్ డెవలపర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, డేటా ఇంజినీర్లు తదితర ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు వివరించారు.

అభ్యర్థులు డిగ్రీ కంప్యూటర్స్, బీటెక్, బీఈ, ఎంసీఏ, డిప్లొమా అర్హతలతోపాటు సంబంధిత రంగంలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలన్నారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మరిన్ని వివరాలకు విజయనగర్ కాలనీలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న TOMCOM కార్యాలయంలో లేదా 7893566493, 98496 39539 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @