సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, సంఘాల పూర్తి జాబితా

హైదరాబాద్ (జనవరి – 01) : భారత సమాజం మద్య యుగాల నుండి ఆధునిక యుగానికి పరివర్తనం చెందుతున్న తరుణంలో సమాజంలోని మౌడ్యాలను, మూడ నమ్మకాలను పారద్రోలి నవ సమాజ నిర్మాణానికి నడుం బిగించిన అనేకమంది మహనీయులు వివిధ సమాజాలను స్థాపించారు. (socio-religious-reforms-unions-list-in-india)

సామాజిక, మత సంస్కరణల ఉద్యమాల పితామహుడు గా రాజ రామ్మోహన్ రాయ్ ని పేర్కొంటారు. పోటీ పరీక్షల నేపథ్యంలో అన్ని ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణ సంఘాలు, అవి స్థాపించిన సంవత్సరం, స్థాపకుల పేరు, స్థాపించిన ప్రదేశాల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం…

సమాజం పేరు
సంవత్సరం
స్థాపకుల పేరుప్రదేశం
ఆత్మీయ సభ
(1815)
రాజ రామ్మోహన్ రాయ్కలకత్తా
బ్రహ్మ సమాజం
(1828)
రాజ రామ్మోహన్ రాయ్కలకత్తా
ధర్మ సభ
(1829)
రాధకాంత్ దేవ్కలకత్తా
తత్వబోధిని సభ
(1839)
దేవేంద్రనాథ్ ఠాగోర్కలకత్తా
మనయ్ ధర్మ సభ
(1844)
నేతాజీ దుర్గరామ్ మంచరామ్సూరత్
పరమహంస మందిర్
(1849)
దడోబా పాండురంగబొంబాయి
రాధస్వామి సత్సంగ్
(1861)
తులసీరామ్ఆగ్రా
బ్రహ్మ సమాజం ఆఫ్ ఇండియా
(1866)
కేశుభా సుందర్ సేన్కలకత్తా
దార్ – ఉల్ – ఉలూమ్
(1866)
మహ్మద్ ఖాసిం నన్తోవి, రషీద్ ఆహ్మద్ గంగోయ్, అబిద్ హుస్సేన్దియోబాండ్ (UP)
ప్రార్దన సమాజం
(1867)
డా. ఆత్మరామ్ పాండురంగబొంబాయి
ఆర్య సమాజం
(1875)
స్వామి దయానందబొంబాయి
థియోసోఫికల్ సొసైటీ (1875)హెలినా పెట్రోవన్ బ్లెవట్‌స్కీ, కలోనిల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం ఖాన్ జడ్గేన్యూయార్క్ సిటీ
సదారం బ్రహ్మ సమాజం
(1878)
ఆనంద్ మోహన్ బోస్,
సిబ్ చంద్రదేవ్,
ఉమేష్ చంద్రదత్త
కలకత్తా
డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ
(1884)
బాలగంగాధర్ తిలక్ ,
విష్ణుశాస్ర్తి చిపులాంకర్,
గోపాల్ గణేష్ అగార్కర్
పూణే
మహ్మదన్ ఎడ్యుకేషన్ సంఘం
(1886)
సయ్యద్ ఆహ్మద్ ఖాన్ఆలీఘర్
దేవ సమాజం
(1887)
శివ నారాయణ్ ఆగ్నిహోత్రిలాహోర్
రామకృష్ణ మిషన్
(1897)
స్వామి వివేకానందబేలూర్
సర్వెంట్స్ ఆఫ్ ఇండియా
(1905)
గోపాల కృష్ణ గోఖలేపూణే
సేవా సదన్ సొసైటీ (1909)రాంబాయ్ రణడేపూణే
సోషల్ సర్వీస్ లీగ్
(1911)
నారాయణ్ మల్హర్ జోషిబొంబాయి