AFGvsSL : ఆఫ్ఘనిస్తాన్ అసమాన పోరాటం వృదా

లాహోర్ (సెప్టెంబర్ – 05) : ASIA CUP 2023 గ్రూప్ బి లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ అసమానమైన పోరాటం వృదా అయింది. చివరి దాకా పోరాడిన ఆప్ఘనిస్థాన్ 2 పరుగుతేడాతో ఓడి ఇంటిదారి పట్టింది. శ్రీలంక సూపర్ – 4 కి చేరింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 291 పరుగులు చేయగా సూపర్ పోరుకు అర్హత సాధించాలంటే ఆఫ్ఘనిస్తాన్ 37.1 ఓవర్లలోనే లోని ఈ లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది. అయితే అఫ్ఘనిస్తాన్ 37.4 ఓవర్స్ లో 289 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

దీంతో ఆసియా కప్ 2023 లో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు సూపర్ – 4 కి చేరాయి.

మొదట బ్యాటింగ్ చేసిన లంక కుశాల్ మెండీస్ 92 పరుగులతో రాణించడంతో 291 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ నబీ రాణించినప్పటికి 37.4 ఓవర్లలో 289పరుగులకు ఆలౌట్ అయింది.