SIVE : పటాపట్ నౌకరీ కోసం షార్ట్ టెర్మ్ వొకేషనల్ కోర్సులలో దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్: స్వల్పకాల వృత్తి విద్యా కోర్సుల (ఫటాఫట్ నౌకరీ కోర్సులు) కొరకు నమోదు చేసుకోగోరు విద్యార్ధులు బోర్డు వెబ్సైట్ లో 53 కోర్సులలో కావాల్సిన కోర్సులను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవడానికి.. ఆగస్టు 19వ తేదీ వరకు ఆన్లైన్ లో రుసుమును చెల్లించడానికి అవకాశం కల్పించారు. గడువు పెంచటం జరిగింది.

5వ తరగతి నుంచి ఫీజీ వరకు అర్హతలతో షార్ట్ టెర్మ్ వొకేషనల్ కోర్సులు కలవు. వెంటనే ఉద్యోగ కల్పించే ఉద్దేశ్యం తో ఈ కోర్సులను అందుబాటులో ఉంచారు.

తెలంగాణ రాష్ట్రంలో స్వల్ప కాలిక వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్న అన్ని ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, NGOs మరియు ఇతర సంస్థల మేనేజ్మెంట్స్ ఒరిజినల్ సెక్షన్లకు మించి ఏవేని ఉన్నచో, అదనపు కోర్సుల కలుపుకొని తాత్కాలిక అఫిలియేషన్ పొడిగింపు మరియు ఆఫీలియేషన్ కొరకు జూలై 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

◆ వెబ్సైట్ : www.sive.telangana.gov.in