Home > CURRENT AFFAIRS > REPORTS > SIPRI REPORT 2023 – ఆయుధాల ఎగుమతి, దిగుమతి రిపోర్ట్

SIPRI REPORT 2023 – ఆయుధాల ఎగుమతి, దిగుమతి రిపోర్ట్

BIKKI NEWS (MARCH 12) : స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI) 2019 – 2023 మధ్య వివిధ దేశాల ఆయుధాల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి నివేదికను (SIPRI – TRENDS IN INTERNATIONAL ARMS TRANSFERS 2023 REPORT) వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశంగా అమెరికా, అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారతదేశం మొదటి స్థానాలలో నిలిచాయి.

2014 – 19 సంవత్సరాలతో పోలిస్తే 2019 – 23 లో భారత ఆయుధాలు దిగుమతి 4.6% పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. భారత్ అత్యధికంగా రష్యా దేశం నుండి (36%) ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది.

ఆయుధాల ఎగుమతి టాప్ – 5 దేశాలు

1) అమెరికా – 42%
2) ప్రాన్స్ – 11%
3) రష్యా – 11%
4) చైనా – 5.8%
5) జర్మనీ – 5.6%

ఆయుధాల దిగుమతి టాప్ – 5 దేశాలు

1) ఇండియా – 9.8%
2) సౌదీ అరేబియా – 8.4%
3) ఖతార్ – 7.6%
4) ఉక్రెయిన్ – 4.9%
5) పాకిస్థాన్ – 4.3%