BIKKI NEWS (APRIL 24) : SIPRI REPORT 2023 ON MILITARY SPENDING – స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2023 సంవత్సరంలో వివిధ దేశాలు రక్షణ అవసరాల కోసం చేసిన ఖర్చును వెల్లడించింది.
రక్షణ అవసరాల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది ఇది 2023లో 91,600 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. ఈ నివేదికలో రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. ఉక్రెయిన్ 8వ స్థానంలో నిలవడం విశేషం.
నివేదికలో భారత్ నాలుగవ స్థానంలో నిలిచింది రక్షణ అవసరాల కోసం 2023లో భారత్ 8,360 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. ఇది 2022 తో 4.2% అధికం. అలాగే 2014తో పోలిస్తే 44 శాతం అధికం కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా రక్షణ అవసరాల కోసం 2023లో 2,44,330 కోట్ల డాలర్లను ప్రపంచ దేశాలు ఖర్చు చేశాయి. ఇది 2022తో పోలిస్తే 6.8 శాతం ఎక్కువ.