అమ్మాయిలకు 36,200 స్కాలర్ షిప్ పథకం

హైదరాబాద్ (అక్టోబర్ – 19) : పీజీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న యువతులకు పోస్ట్ గ్రాడ్యుయోట్ ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ ఒక ప్రకటన లో తెలిపింది. సంవత్సరానికి 36,200 చొప్పున రెండు సంవత్సరాలు అందిస్తారు. ఈ స్కాలర్షిప్పును ఏడాదికి 3000 మందికి అందిస్తున్నారు.

అర్హతలు : తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అయివుండాలి. అలాగే మొదటి సంతానంలో ఇద్దరూ కవలలు అది కూడా అమ్మాయిలే అయితే వారిద్దరికీ ఈ స్కాలర్షిప్పునకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే స్కాలర్షిప్పు వర్తించదు. ఈ విద్యా సంవత్సరంలో పీజీ ప్రథమ సంవత్సరం లో ఎం.ఏ, ఎంకాం, ఎం.ఎస్సీ చదువుతున్న వారు మాత్రమే అర్హులు

◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబరు 31

◆ వెబ్సైట్ : https://scholarships.gov.in/