త్వరలో సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ – ఎండీ శ్రీధర్

సింగరేణిలో ఖాళీగా ఉన్న 651 పోస్టులను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్‌ ట్రెయినీలు, మిషన్‌ ట్రెయినీలు, మోటార్‌ మెకానిక్‌, మౌల్డర్స్‌ పోస్టులున్నాయి. అధికారుల స్థాయిలో పర్సనల్‌ ఆఫీసర్లు, మెయిన్‌మేంట్‌ ట్రెయినీలు, వివిధ జూనియర్‌ ఫారెస్ట్‌ అధికారుల పోస్టులున్నాయి. వీటితో పాటు జూనియర్‌ స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌లు తదితర వైద్య సిబ్బందిని సైతం త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ఇవేకాకుండా త్వరలో అంతర్గత సిబ్బందితో 1,436 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇంటర్వ్యూ లేకుండా రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులంతా కష్టపడి చదివి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.

Follow Us@