సిక్కు గురువులు – వారి ప్రాముఖ్యత

BIKKI NEWS : సిక్కు గురువులు వారి విశేషాలను పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం. (Sikh guru’s and their work for sikh relegion )

★ గురు నానక్ :- మొదటి సిక్కు గురువు. ఇతని బోధనలతో సిక్కుమతం ఆవిర్భవించింది. సిక్కు అంటే శిష్యుడు అని అర్థం

★ గురు అంగద్ :- రెండో సిక్కు గురువు. గురుముఖి లిపిని ఆవిష్కరించాడు. గురునానక్ జీవిత చరిత్ర రాశాడు. హుమాయూన్ ఇతని ఆశీస్సులు తీసుకున్నాడు

★ గురు అమరదాస్ :- మూడో సిక్కు గురువు. లంగర్ వ్యవస్థ (గురుద్వారా సందర్శకులకు ఉచితంగా భోజనం అందించడం ప్రారంభించారు.)

★ గురు రామ్ దాస్ :- నాలుగో సిక్కు గురువు. హర్ మందిరానికి అక్బర్ భూమిని కేటాయించారు. హర్ మందిర నిర్మాణం ప్రారంభం. స్వర్ణ దేవాలయం చుట్టూ సరస్సు నిర్మించాడు.

★ గురు అర్జున్ :- ఐదో సిక్కు గురువు. ఆది గ్రంథం( గ్రంథ సాహిబ్) సంకలనం. హర్ మందిర నిర్మాణం పూర్తి .ఇతన్ని 1606 లో జహంగీర్ ఉరితీశాడు. దేశ రాజకీయాల్లో ఇతడు జోక్యం చేసుకున్నాడు.

★ గురు హర గోవింద్ :- ఆరో సిక్కు గురువు. జహంగీర్ పది సంవత్సరాలు ఖైదు చేశాడు. అకల్ తక్త్ (కోర్ట్) నిర్మాణము.

★ గురు హరరాయ్ :- ఏడో సిక్కు గురువు. మొగల్ వారసత్వ యుద్ధంలో “దారాసుకో” కు మద్దతు పలికారు.

★ గురు హరికిషన్ :- ఎనిమిదో సిక్కు గురువు. ఐదు సంవత్సరాలకే సిక్కు గురువు అయ్యాడు.

★ గురు తేజ్ బహదూర్ :- తొమ్మిదో సిక్కు గురువు. ఔరంగజేబు వల్ల మరణించాడు.

★ గురు గోవింద్ సింగ్ :- పదో సిక్కు గురువు. కల్సా వ్యవస్థ స్థాపించారు. దీని ప్రకారం సిక్కులు కేస్ (వెంట్రుకలు) కంగా (చెక్క దువ్వెన) కర (ఇనుప కడియం) కచ్ఛెర (పొట్టి లాగు) కృపాణ్ (ఖడ్గము) కలిగి ఉండాలి. సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు.