BIKKI NEWS (APRIL 30) : ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందని (SIDE EFFECTS DUE TO COVISHEILD VACCINE) తొలిసారిగా అంగీకరించింది.
వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకేలో పలువురు కోర్టుకెక్కారు. రక్తం గడ్డ కట్టడంతో పాటు ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ‘అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చు’ అని ఆస్ట్రోజెనెకా కోర్టుకు తెలిపింది.
ఈ కంపెనీ ‘కొవిషీల్డ్’ పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి కరోనా వ్యాక్సిన్ ను ఈ కంపెనీ తయారు చేసింది.