సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా రూ.225 కోట్ల ఖర్చుతో 960 పడకల జనరల్ హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేశారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీని సుమారు 25 ఎకరాల స్థలంలో రూ.135 కోట్లతో నిర్మించారు. ఈ భవన సముదాయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ 2017, అక్టోబర్ శంకుప్థాపన చేశారు.
కళాశాల ఏర్పాటు కావడంతో సిద్దిపేట జనరల్ దవాఖానలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. 2018-19 మొదటి బ్యాచ్‌లో 150 మంది విద్యార్థులు, 2019-20 రెండో బ్యాచ్‌లో 175 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2020-21 మూడో బ్యాచ్‌కు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి.
Follow Us@