ఎస్ఐ‌, పోలిస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.

★ ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ ::

  • ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.
  • మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు

వయోపరిమితి :

  • కానిస్టేబుల్ 18 – 25 ఏళ్ల మద్య ఉండాలి. BC, ST, ST, EWS లకు 5 ఏళ్ల సడలింపు కలదు
  • ఎస్ఐ 21 – 28 ఏళ్ల మద్య ఉండాలి. BC, ST, ST, EWS లకు 5 ఏళ్ల సడలింపు కలదు

ఎస్ఐ పోస్టుల వివ‌రాలు ::

  • సివిల్ ఎస్ఐలు – 414
  • ఏఆర్ ఎస్ఐలు – 66
  • ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు – 05
  • టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు – 23
  • స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు – 12
  • విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ – 26
  • జైళ్ల శాఖ – 08
  • ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు – 22
  • పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ – – 3
  • ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు – 08

★ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ pdf file

★ కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు..

  • సివిల్ కానిస్టేబుల్స్ -4965
  • ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423
  • ఎస్ఏఆర్ సీఎల్ – 100
  • టీఎస్ఎస్‌పీ – 5010
  • స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ – 390
  • విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610
  • జైళ్ల శాఖ(పురుషులు) – 136
  • జైళ్ల శాఖ(స్త్రీలు )-10
  • ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262
  • పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21
  • పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100

పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ pdf file