BIKKI NEWS (APR. 30) : Shri shri Jayanthi celebrations in khammam by jashuva sahithya vedika. మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా జాషువా సాహిత్య వేదిక బాధ్యులు, తెలుగు అధ్యాపకులు మరియు శ్రీ శ్రీ అభిమానులు ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ లోని శ్రీ శ్రీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
Shri shri Jayanthi celebrations in khammam by jashuva sahithya vedika.
ఈ కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ తెలుగు అధ్యాపకులు & టిగ్లా రాష్ట్ర నాయకులు నయీమ్ పాష మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీ శ్రీ కి ముందు, శ్రీ శ్రీ కి తర్వాత అన్న విధంగా వైవిధ్యంగా రచనలు చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మూస పద్దతిలో వెళుతున్న సాహితీ గమన గతిని మార్చి సామాన్యులకు చేరే విధంగా ఎన్నో అభ్యుదయ రచనలు చేసి తెలుగు కవులలో ఎవరూ మరచిపోని విధంగా తనదైన ముద్రను వేశారు శ్రీశ్రీ ” అని పేర్కొన్నారు.
హేతువాదిగా, అభ్యుదయ కవిగా, ముఖ్యంగా పండితులకు కొద్దిమందికి మాత్రమే అర్ధమయ్యే ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రచనలు చేసిన ధీశాలి శ్రీ శ్రీ అని, వారి రచనల్లో ‘మహా ప్రస్థానం’ ఒక సంచలనం అని కొన్ని కోట్లమంది తెలుగు వారిలో చైతన్యం తీసుకువచ్చిన రచన అని, తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు, తెలుగువారు ఉన్నంత వరకు శ్రీ శ్రీ సాహిత్యం ఉంటుందని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు శ్రీమతి సుధారాణి, శ్రీనివాసరావు, బండి ఈశ్వర్, శ్రీ శ్రీ అభిమానులు జె వి రామకృష్ణ, శ్రీ చైతన్య , ధర్మారపు రమణ, సతీష్ రెడ్డి, విజయలక్ష్మి, భగత్ తదితరులు పాల్గొన్నారు.
- CURRENT AFFAIRS YEAR BOOK 2025 – కరెంట్ అఫైర్స్
- MAY IMPORTANT DAYS LIST – మే నెల ముఖ్య దినోత్సవాలు
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల యాక్షన్ ప్లాన్
- INTERMEDIATE – ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
- STOCK MARKET – నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు