కొలువు చూపే కోర్సులు

ఇంటర్లో స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు ఇప్పటికే 43 కోర్సులు నిర్వహిస్తున్న బోర్డు
• కొత్తగా మరో 15 ప్రారంభిస్తున్న అధికారులు

ఉద్యోగానికి నైపుణ్యాలే గీటురాయిగా మారటంతో ఇంటర్ విద్య అధికారులు స్పల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే 43 కోర్సులను నిర్వహిస్తుండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి మరో 15 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 40 కాలేజీల్లో ఈ కోర్సులను నిర్వహిస్తుండగా, ఏటా 3 సార్లు ప్రవేశాలు కల్పించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

ప్రతీ మాడ్యూల్కు 2,100 చొప్పున ఏటా 6,300 మంది ఈ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఈ షార్టర్మ్ కోర్సుల నిర్వహణకు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతోపాటు, ఎన్జీవోలకు సైతం కోర్సుల నిర్వహణకు గుర్తింపునిస్తున్నారు. ఫీజు రూ.600-1,800 మాత్రమే కావటంతో అందరికీ అందుబాటులో ఉన్నాయి. శిక్షణ పూర్తికాగానే ఇంటర్ అధికారులే జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు.

కోర్సుల వివరాలు

Follow Us @