10 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల పంపిణీ – మంత్రి తలసాని

గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ ప్రకటించారు.

రాష్ట్రంలో 8,109 గొర్రెల పెంపకం దారుల సొసైటీ లు ఉండగా, వీటిలో 7,61,895 మంది సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరందరికీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అన్నారు.

రెండు విడతలలో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు 2017 వ సంవత్సరంలో ప్రారంభించి మొదటి విడతలో 3,66,373 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇందుకోసం 4,579 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు.

మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల తో 2017-18 లో 20.75 లక్షలు, 2018-19 లో 39.94 లక్షలు, 2019-20 లో 39.28 లక్షలు, 2020-21 లో 37.12 లక్షల గొర్రెల సంపదను సృష్టించడం జరిగిందని వివరించారు. నూతనంగా పుట్టిన ఒక కోటి 37 లక్షల గొర్రె పిల్లల విలువ 6,169 కోట్ల రూపాయలు అని మంత్రి చెప్పారు.

Follow Us@