భారతదేశ అత్యున్నత సైన్స్ పురస్కారం శాంతి స్వరూప్ భట్నగర్ బహుమతి 2020 (shanti-swarup-bhatnagar-awards-2020) ఏడాదికి గాను 14 మంది శాస్ర్తవేత్తలకు లభించింది. అవార్డు పొందిన 14 మంది శాస్త్రవేత్తల పేర్లను కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) విడుదల చేసింది. ప్రతీ ఏడాది శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ. 5 ప్రైజ్ మనీగా అందజేస్తారు.
● అవార్డులు అందుకున్న వారు.
* ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి డాక్టర్ అభిజిత్ ముఖర్జీ,
* ఐఐటీ కాన్పూర్ నుంచి డాక్టర్ బుష్రా అతీక్
* సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుండి డాక్టర్ శుభదీప్ ఛటర్జీ,
* నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ నుండి డాక్టర్ వత్సల తిరుమలై,
* ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ నుండి డాక్టర్ జ్యోతిర్మాయే దాస్,
* ఐఐటి బొంబాయి నుండి డాక్టర్ సూర్యేందు దత్తా,
* జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ నుండి డాక్టర్ సుబి జాకబ్ జార్జ్ ,
* బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ కిన్‌షుక్ దాస్‌గుప్తా,
* పిజిఐఎంఈఆర్ చండీగఢ్ నుండి డాక్టర్ రితేష్ అగర్వాల్
* హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ అమోల్ అరవింద్రావ్ కులకర్ణి, డాక్టర్ సూరజిత్ ధారా అవార్డులను అందుకున్నారు.