హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : హైదరాబాద్ లోని మహబూబియా జూనియర్ కళాశాల (బాలికల) లో చదువుతున్న షేక్ నజియాకు లండన్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఫెన్సింగ్ క్రీడలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగంలో రెండు కాంస్య పథకాలను గెలుచుకుంది.
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సుహాసిని మరియు అధ్యాపక బృందం షేక్ నజియాను ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రిన్సిపాల్ సుహాసిని మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇలాంటి మరిన్ని విజయాలు సాదించి కళాశాలకు మరియు దేశానికి మంచి పేరు తేవాలని పేర్కొన్నారు.
Follow Us @