మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలి. – SFI డిమాండ్.

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 25 నుండి ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని టైం టేబుల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు రద్దు చేయాలని భారత విధ్యార్ధి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) – తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులకు పరీక్షలునిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో 2019-20 మరియు 2020-2021 విద్యాసంవత్సరం కూడా పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్ధులను ప్రమోట్ చేశారు.

కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయి. అయినా హస్టల్స్, గురుకులాలు ప్రారంభం కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం అక్టోబర్ లో పరీక్షలు పెట్టాలని షెడ్యూల్ ఇచ్చారు. రిమోట్ ఏరియాలు అయిన కోమరంభీం, ఆదిలాబాద్, భద్రాచలం, ములుగు, జిల్లాలో ఆదివాసి ప్రాంతాల్లో కనీసం ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆన్లైన్ చదువులే సాగనికాలంలో ఈ పరీక్షలను విద్యార్థులు ఎలా రాస్తారు.

రెండవ సంవత్సరం పాఠాలు చదువుకుంటూ, మొదటి సంవత్సరం పరీక్షలు రాయడం అంటే సాధ్యపడె అంశం కానే కాదు. కార్పోరేట్ కాలేజీలు కోసంతప్ప మరి దేనికి ఈ పరీక్షలు ఉపయోగపడవు.

ఏలాగు రెండవ సంత్సరం పరీక్షలు విద్యార్ధులు రాస్తారు. కాబ్బటి మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి విద్యార్ధులకు ఒత్తిడి లేకుండా చేయాలని ఎస్.ఎఫ్.ఐ. కోరుతుంది. దీనికోసం పరీక్షలు రద్దు చేయాలని ఎస్.ఎఫ్. ఐ. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొని జయప్రదం చేయాలని విద్యార్ధి లోకానికి ఎస్.ఎఫ్.ఐ. పిలుపునిస్తుందని తెలిపారు