- ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి.
- సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వంపట్ల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధన సమితి హర్షం.
హైదరాబాద్ (మార్చి – 18) : తెలంగాణ రాష్ట్రంలోని సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేస్తూ ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపుల్ సెక్రెటరీ
సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల/ లెక్చరర్ క్రంబద్దీకరణ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కుప్పిశెట్టి సురేష్ తెలిపారు.
ఈ జీవో వలన సెర్ప్ లో పనిచేస్తున్న FTEs,,MSCCs, ఫీల్డ్ మినిస్టర్ అండ్ సపోర్టింగ్ స్టాప్ మొత్తం 3994 మంది ఉద్యోగులకు ఆర్థిక లాభం చేకూరుతుందని తెలుపుతూ. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు వర్తింపజేసి మాట నిలబెట్టుకున్నారని తెలుపుతూ, అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు /లెక్చరర్ అందరికీ కూడా వెంటనే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేస్తూ వారి కుటుంబాల్లో ఆనందం నింపాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల/ లెక్చరర్ క్రమబద్ధీకరణ సాధన సమితి తరపున కోరుతున్నట్లు తెలిపారు.