విద్యార్థులే ఇంటర్ అడ్మిషన్ చేసుకునే వెసులుబాటు

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులు 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పొందడానికి కళాశాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా స్వంతంగా ఆన్లైన్ లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. మొదటి దశ అడ్మిషన్లు జూలై – 05 వ తేదీతో ముగియనున్నాయి.

కరోనా తీవ్రంగా వ్యాపించిన నేపథ్యంలో అడ్మిషన్లను విద్యార్థులు కళాశాలకు రాకుండా కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా “సెల్ప్ ఎనరోల్మెంట్ ఆన్లైన్ ఆప్షన్ పారమ్” లో వివరాలు వస్తాయి. తగిన వివరాలు నింపడం ద్వారా అడ్మిషన్ పొందవచ్చునని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ – 1 నుండి ఆన్లైన్ అడ్మిషన్లు అందుబాటులో ఉండనున్నాయి.

అడ్మిషన్ పొందడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి.

https://tsbie.cgg.gov.in/bieFirstYearAdmission.do

www.tsbie.cgg.gov.in

Follow Us@