డిగ్రీ మరియు ఆపై విద్యార్థులకు స్వీయ సమ్మతి పత్రంతో కళాశాలలోకి ప్రవేశం

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు కళాశాల కు హజరవ్వాలంటే స్వీయ సమ్మతి (సెల్ఫ్‌ కాన్సెంట్‌) పత్రం సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల సమ్మతి పత్రం అవసరం లేకుండా ఉన్నత విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.

డిగ్రీ ఆపై తరగతులు చదివేవారంతా వయస్సు రీత్యా మేజర్లు కావడంతో, స్వీయ నిర్ణయం తీసుకొనే శక్తి వ్యక్తిగతంగా ఉండటంతో తరగతులకు హాజరయ్యే స్వేచ్ఛనువారికే వదిలేసింది.

ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖకు బదులుగా విద్యార్థులే సెల్ఫ్‌ కాన్సెంట్‌ సమర్పిస్తే సరిపోతుందని యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (UGC) ఆదేశాలచ్చింది. UGC ఆదేశాలనే ఇక్కడా అమలు చేయలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉన్నత విద్య శాఖ అధికారులు తెలిపారు.

Follow Us@