వైజ్ఞానిక యాత్రకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) విద్యార్థులు

వరంగల్ NIT లో జరుగుతున్న నేషనల్ సైన్స్ పెయిర్ ను సందర్శించిన సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగిందని రసాయన శాస్త్ర అధ్యాపకుడు నీరటి విష్ణు తెలిపారు.

విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం మరియు నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన కల్పించి వారిలో విజ్ఞాన శాస్త్రం పట్ల తృష్ణ పెంచే చర్యలలో భాగంగా ఇలాంటి వైజ్ఞానిక యాత్రలకు పంపినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

ఈ వైజ్ఞానిక యాత్రలో అధ్యాపకులు నీరటి విష్ణు ప్రసాద్, అరుంధతి, రాజశేఖర్, రవీందర్, శ్రీనివాస్,జ్యోతి, మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us @