పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి సైన్స్ పెయిర్

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి SCERT హైదరాబాద్ వారు ప్రధాన అంశం (మెయిన్ థీమ్) మరియు ఉప అంశాలను (సబ్ థీమ్స్) విడుదల చేశారు.

విద్యార్థులు 2020 – 21 “రాష్ట్ర స్థాయి విజ్ఞాన, గణిత, పర్యావరణ ప్రదర్శన” కు సంబంధించి ప్రధాన అంశంగా “సాంకేతిక – ఆట బొమ్మలు” కాగా ఉప అంశాలుగా

1) పర్యావరణ అనుకూల పదార్థాలు
2) ఆరోగ్యం – పరిశుభ్ర
3) సంబంధిత సాప్ట్ వేర్
4) చారిత్రక అబివృద్ది
5) గణిత నమూనాలు ఉన్నాయి.

పైన చెప్పబడిన ఉప అంశాలే కాక ప్రధాన అంశానికి సంబంధించిన ఇతర ఉప అంశాల పై కూడా విద్యార్థులు ప్రదర్శన ఇవ్వవచ్చు..

వైజ్ఞానిక ప్రదర్శన నే కాక నిత్య జీవితంలో శాస్త్ర సాంకేతిక అన్వయం పైన వైజ్ఞానిక ప్రదర్శన లో పాల్గోనే విద్యార్థులకు ఒక్క రోజు ఒరియంటేషన్ సెమినార్ కూడా కలదు.

కావునా జిల్లా విద్యాధికారులు పైన చెప్పబడిన వైజ్ఞానిక ప్రదర్శన కు సంబంధించిన అంశాలను పాఠశాలల విద్యార్థులకు తెలిరబరిచి, వారిచేత వైజ్ఞానిక నమూనాలను తయారు చేయించి జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శన యందు పాల్గొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు.

Follow Us@