పాఠశాలల్లో సైన్స్ దినోత్సవం నిర్వహించాలి : SCERT

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని (ఫిబ్రవరి – 28) పురస్కరించుకొని పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేసింది. సోమవారం వ్యాసరచన, క్విజ్, వక్తృత్వపోటీలు నిర్వహించాలని ఆదేశించింది. సైన్స్ ఉపకరణాలు, ప్రాజెక్ట్ లను ప్రదర్శించి పలు ప్రయోగాలు చేయించి విజ్ఞాన మేళాలు నిర్వహించాలని సూచించింది. శాస్త్రవేత్తలును స్కూళ్లకు ఆహ్వానించి సైన్స్ అంశాలు బోధించాలని పేర్కొన్నది.

ఎన్ఎస్ఈపీపై సర్వే

నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)పై ఎస్సీఈఆర్టీ సర్వే నిర్వహిస్తున్నది. ప్రధానోపాధ్యాయు లు, ప్రిన్సిపాళ్లు, స్కూల్ హెడ్స్, టీచర్ల ద్వారా వివరాలు క్రోడీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళిని పంపించారు.

Follow Us @