మార్చి 31 వరకు పాఠశాలలు మూసివేత.

దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను తెరవడం లేదు. . ఈనేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నాటి వరకూ అనగా పాఠశాలలను మార్చి 31 వరకు తెరవకూడదని నిర్ణయం తీసుకుంది. అలాగే రానున్న విద్యాసంవత్సరాన్ని 2021 ఏప్రిల్‌లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించమని, వార ప్రాజెక్టుల ఆధారంగా మార్కులు కేటాయింపు ఉంటుందని తెలిపారు.

9, 11వ తరగతి విద్యార్థులకు వారం లేదా రెండు వారాలకు ఒకరోజు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

కేవలం 10, 12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
కొవిడ్‌-19 నిబంధనల ప్రకారమే 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Follow Us@