నియామకాల కంటే ముందే స్కూల్ లు జూనియర్ కాలేజ్ లుగా అప్ గ్రేడ్.!

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమైన నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీల లెక్కలు తీస్తున్న సందర్భంగా విద్యా శాఖ లో దాదాపు 25 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

అయితే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కంటే ముందే ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా చేయడం వలన టీచర్ల సర్దుబాటు జరిగి ఉపాద్యాయ ఖాళీల పై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కంటే ముందే టీచర్లకు పదోన్నతులు మరియు బదిలీలు కూడా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Follow Us@