18 నుండి విద్యా సంస్థలు ప్రారంభించడానికి సన్నాహాలు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, టెట్‌ నిర్వహణ, విద్యాసంస్థల పునఃప్రారంభం తదితర అంశాలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ అదనపు కమీషనర్ శ్రీహరి, NCERT కమీషనర్ రాధారెడ్డిలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

సంక్రాంతి సెలవుల తర్వాత 18వ తేదీ నుంచి 9, 10, ఇంటర్‌ తరగతులను ప్రారంభించాలని సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై ఈ నెల 7న ముఖ్యమంత్రితో చర్చించిన తరవాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Follow Us@