ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించడానికి సిద్ధం .!

దేశ వ్యాప్తంగా వివిద రాష్ట్రాలు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో కూడా పాఠశాలల పునఃప్రారంభం పై నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఏ రాష్ట్రాల ప్రణాళిక ఎలా ఉందో అక్కడి విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల(SCERT) అధికారులను, విద్యాశాఖ కార్యదరులను సంప్రదించి వివరాలను తెలుసుకొని అది సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.

ఈనెల 1న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగగా అంతకు ముందు రోజు ఈ నివేదికను సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలోనూ ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు దశలవారీగా ప్రారంభించాలని నివేదికలో పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది.

రోజు విడిచి రోజు తగిన జాగ్రత్తలతో బడులు తెరవాలని తాజాగా విద్యపై పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. మరో వైపు పలు రాష్ట్రాలు ఆ దిశగా ఇప్పటికే పాఠశాలలు ప్రారంభించడానికి తేదీ లను ప్రకటించాయి.

దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఇక్కడా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us @