విద్యా సంస్థల మూసివేత ఉత్తర్వులలో లేని స్పష్టత.!

కరోనా కారణంగా దాని వ్యాప్తి ని నిరోధించడానికి విద్యార్థుల, ఉపాద్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని తెలిపారు. అయితే విద్యా సంస్థలకు బోధన బోధనేతర సిబ్బంది హాజరు కావాలా వద్దా అనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది

ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో (జీవో 67) కూడా తక్షణమే విద్యా సంస్థలన్నీ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మరలా విద్యాసంస్థల ప్రారంభానికి సంబంధించి త్వరలో ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.

అయితే సబితా ఇంద్రారెడ్డి ప్రకటనలో కానీ, ప్రభుత్వ ఉత్పత్తులలో కానీ ఎక్కడా కూడా విద్యార్థులకు మాత్రమే విద్యా సంస్థలకు హజరు కాకూడదు అనే అంశం లేదు. పూర్తిగా తాత్కాలికంగా విద్యా సంస్థలు మూసివేత అని మాత్రమే ఉంది.

అయితే విద్యా సంస్థలకు బోధన బోధనేతర సిబ్బంది హాజరు కావాలా వద్దా అనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దీని మీద ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలు మధ్య చర్చ జరుగుతోంది విద్యాసంస్థలు మూసివేత అన్నప్పుడు పూర్తిగా విద్యాసంస్థలను మూసివేయడం అని కొందరు, లేదు బోధన బోధనేతర సిబ్బంది కళాశాలలకు, పాఠశాలకు హాజరు కావాల్సిందేనని కొందరు అంటున్నారు.

ఈ నేపథ్యంలో విద్యా సంస్థల మూసివేత మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి సంబంధిత విద్యా బోర్డులకు ఉంది.

Follow Us@